హైదరాబాద్ కేకే మీడియా నవంబర్ 8
రాజకీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు…
సర్వే సంస్థలకే తలనొప్పులుగా మారుతున్న ఓటర్ల అభిప్రాయం…
అంతిమ విజయం డబ్బే అని అనుకుంటున్నా …
ఓటర్లు మాత్రం మేమే తెలివైన వాళ్ళమని అనిపించేలా వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయో ఏ నియోజకవర్గంలో ఎవరికి ప్రజలు పట్టడం కడతారని అర్థం కాని అయోమయ ఆందోళనలో ఉన్నారు.
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కండువాలు మార్చే నాయకులు కార్యకర్తలు, ఓటర్లతో, సందడిగా మారింది.
కొన్నిచోట్ల ప్రత్యర్ధులు ఇంకా ఖరారు కానప్పటికీ నామినేషన్ల పర్వం పదో తారీకు ముగుస్తుండడం మూడు రోజుల్లో పూర్తిస్థాయి ప్రచారం మొదలవడం ఇంత తతంగా నడుస్తున్న ఏ ఒక్క సర్వేకు సరైన సమాధానం ఓటరు మదిలో ఉన్న నిజమైన ఆలోచన బయటపడక ఇటు పార్టీ శ్రేణులు పోటీలో నిలబడుతున్న అభ్యర్థులు, సర్వేల పేరుతో గ్రామ గ్రామాన వాడ వాడనా తిరుగుతున్న సంస్థలు వివిధ p శాఖలు ఎవ్వరికి ఓటరు మదిలో మాట ఒక్కొక్క చోట ఒక్కోలా ఒక్కొక్కరికి ఒక్కోలా తెలియజేస్తుండడంతో జనం నాడి ఎలా ఉందో తెలుసుకునే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ఎవరికి వారు నాదంటే నాదే గెలుపొని అనుకుంటున్నా కొన్ని కొన్నిచోట్ల డబ్బు ఎవరూ ఎక్కువ ఖర్చు పెడతారు వారే విజయం అని అనుకుంటున్నప్పటికీ ఓటరు మాత్రం డబ్బు తీసుకునేవారు అందరి దగ్గర తీసుకొని ఏసేవారికే ఓటేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి తోడు ప్రధాన ప్రత్యర్థులకు దీటుగా చిన్నాచితకా పార్టీలతోపాటు ఇండిపెండెంట్ ల ప్రచార జోరులో ఓట్ల చీలిక సైతం చెప్పలేని పరిస్థితి గా తయారైంది.
ఓటరు మదిలో మెదిలే ఆ నాయకుడు ఎవరో ఏ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించి అందరం ఎక్కిస్తారు వేచి చూడాలి మరి