నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 2
నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి తదితర మండలాలలో కురిసిన భారీ వర్షానికి గరిడేపల్లి వద్ద ప్రధాన టవర్ వద్ద ఏర్పడిన అంతరాయంతో ఎయిర్టెల్, వడఐడియా(VI) సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చేతిలో సెల్ఫోన్ మొగనిదే, సోషల్ మీడియాలో పాల్గొనందే రోజు గడవని ప్రస్తుత పరిస్థితుల్లో 24 గంటల పాటు సేవలు పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో ఏదో కోల్పోయినట్లుగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
కొందరైతే కేవలం జియో సేవలు మాత్రమే వస్తుండడంతో జియో సిమ్ లు భారీగా కొనుగోలు చేశారు.
ఇంతగా ఆకర్షిస్తున్న ఫోన్లు ఒక్కరోజు పని చేయకుంటేనే ఇలా ఇబ్బందులు పడ్డారంటే మనం ఫోన్లకు ఎంతలా ఆడిట్ అయ్యాము అర్థమవుతుంది.
దేనిమీద అంతలా మోజు పెట్టి వ్యసనంలా మార్చుకోవద్దని రకరకాల జబ్బులకి దారి తీసే అవకాశం ఉందని మానసిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు.