హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 5
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ల పర్వం మొదలై అభ్యర్థుల ప్రకటన చేసిన అనంతరం హుజూర్నగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుండి కొత్తగా గులాబీ గూటికి చేరిన నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డికి బిజెపి అధిష్టానం హుజూర్నగర్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో అసంతృప్తిగా ఉన్న స్థానిక బిజెపి నేతలు ఒక్కరు ఒక్కరు గా పార్టీని వీడి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
రాష్ట్ర బిజెపి నాయకుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, హుజూర్నగర్ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ వేముల శేఖర్ రెడ్డి, బాల్సామ్ నాయక్ , జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ నాయక్, చంద్రారెడ్డి, వివిధ మండలాల సీనియర్ నాయకులు ఒక్కరు ఒక్కరు గా పార్టీని వీడుతుండడం, అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఎన్నికలవేళ ఎప్పటినుంచో పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు పార్టీని వీడుతుండడంతో బిజెపి శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
కొత్త ఉత్సాహంతో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన శ్రీలత రెడ్డి తన మార్పు రాజకీయాన్ని బిజెపిలో చూపించాలని అసెంబ్లీ బరిలో దిగిన తరుణంలో, ఇలా పార్టీని ఒక్కరొక్కరుగా వేయడంతో పైకి మాత్రం అంతా మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న, గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తామన్న విశ్వాసాన్ని వెలుగుచున్న, బిజెపి శ్రేణుల్లో మాత్రం రాష్ట్రస్థాయిలో దేశ స్థాయిలో బిజెపి కి ఉన్న ప్రస్తుత ఇమేజ్ ని చేరుకోలేమో అన్న సందిగ్ధంలో కార్యకర్తలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
తన ఉనికిని కాపాడుకునేందుకు హుజూర్నగర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా తన సత్తా చాటేందుకు ఎంత మేరకు ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతారో వేచి చూడాలి మరి.