ప్రపంచ అత్యుత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్
న్యూఢిల్లీ ఆగస్టు 21
ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ ఎన్నికయ్యారు.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వరుసగా రెండోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్‌గా ఎన్నిక కావడం విశేషం. యూఎస్‌కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ ప్రకారం 2024 సంవత్సరం దాస్‌కు ఏ ప్లస్ రేటింగ్ లభించింది. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, వడ్డీరేట్ల నిర్వహణ ఆధారంగా గ్లోబల్ ఫైనాన్స్ 1994 నుంచి ఏటా సెంట్రల్ బ్యాంకుల గవర్నర్‌లకు ఏ నుంచి ఎఫ్ వరకు గ్రేడ్‌లను కేటాయిస్తుంది.