లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అడిషనల్ కలెక్టర్
రంగారెడ్డి కేకే మీడియా ఆగస్టు 13
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పని చేస్తున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ధరణిలో మార్పులు చేసేందుకు రైతు నుంచి రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేయాగా సదరు రైతు అవినీతి నిరోధక శాఖ ఆశ్రయించడం తో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూపాల్ రెడ్డి ఇంట్లో రూ. 16 లక్షల నగదు, ఆస్థిపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.