నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 26
ఎస్ ఆర్ కె అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తృతీయ వార్షికోత్సవ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై పరమేష్ ప్రారంభించారు. ప్రశాంత వాతావరణంలో ఇంటి భోజనాన్ని మరిపించేలా ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నప్రసాదాన్ని తృప్తిగా స్వీకరించారు. కన్నులారా స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో
ఎస్ ఆర్ కె గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కందిబండ హరిప్రసాద్,ఎస్ ఆర్ కె రెసిడెన్సి కమిటీ అధ్యక్షుడు భువనగిరి అంజయ్య , కమిటీ సభ్యులు సుంకర క్రాంతి కుమార్, రాచకొండ శ్రీనివాసరావు ,అరిబండి కిరణ్ కుమార్, రావులపల్లి రోశయ్య, కొత్తా లక్ష్మణ్, రాసంశెట్టి రాంబాబు, యీగా శ్రీనివాస రావు,ఓరుగంటి భాస్కర్, నీలా శ్రీనివాస్ , శ్రీరామ్ సత్యనారాయణ, అరబండి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ ,రామోజీ , వీరయ్య అపార్ట్మెంట్ నివాసిత మహిళలు తదితరులు పాల్గొన్నారు.