హైదరాబాద్ కేకే మీడియా జూన్ 22
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర మలిదశ తొలి అమరవీరుడు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన కాసోజు శంకరాచారి తల్లి శంకరమ్మ కు గులాబీ బాస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నారు.
2014 ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత
ఇదే నియోజకవర్గంలో తిరిగి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న వేళ అనుహంగా శానంపూడి సైదిరెడ్డికి అవకాశం కల్పించడంతో అప్పటినుంచి స్తబ్దతగా ఉన్న శంకరమ్మ కు తిరిగి రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదో ఒక పదవి వస్తుందని ఆశగా ఎదురు చూసినప్పటికీ కనీసం కార్పొరేషన్ అయిన ఇస్తారని ఎదురుచూసిన ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో అలక భూనీ అడపాదనప టీవీ ఛానల్లో అమరవీరుల కుటుంబాలకు రాజకీయంగా న్యాయం చేయాలని చెప్పి కోరుతూన్నా
జిల్లా మంత్రి ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.
ఇటీవల హుజూర్నగర్ కేటీఆర్ వచ్చిన సందర్భంలో, హరీష్ రావు హుజూర్నగర్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆ వేదికలలో పాల్గొన్న శంకరమ్మకు నీకు మంచి రోజులు వస్తున్నాయి అని స్పష్టంగా తెలపడంతో ఇక ఏదో ఒక పదవి కచ్చితంగా వస్తుందని ఆశతో ఎదురు చూడగా నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీష్ రెడ్డి తో గులాబీ బాస్ శంకరమ్మను అమరవీరుల స్తూప ఆవిష్కరణకు తీసుకురావాలని ఆదేశించడంతో కచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ స్థానం తనకే ఇస్తారన్న సంకేతాలు హామీ ఇవ్వడంతో శంకరమ్మ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరి సాయి. ఇప్పటికే శంకరమ్మ కు గన్మిన్లను ప్రభుత్వ వాహనాన్ని ప్రభుత్వం తీయని ఇవ్వనున్నట్లు నేడు రేపు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా నుండి నామినేట్ చేస్తున్నట్లుగా గులాబీ వాసు ప్రకటిస్తాడని తెలుస్తుంది.
తెలంగాణలో ఎన్నికల వేడి సమీపిస్తున్న వేళ అమరవీరుడి తల్లి శంకరమ్మకు ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ పదవి ఇవ్వలేదని దానిని తమ ఆయుధంగా వాడుకునేందుకు ఎప్పటినుంచో ఇటు కాంగ్రెస్ అటు బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఏమాత్రం లొంగకుండా తండ్రి లాంటి కెసిఆర్ ని నమ్ముకున్నానని పదేపదే శంకరమ్మ చెపుతూ వస్తుండడంతో నిజంగా అలాంటి ప్రమాదం సంభవిస్తే టిఆర్ఎస్ కి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని అంచనా వేసిన గులాబీ బాస్ హుటాహుటిన శంకరమ్మకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. ఇట్టి విషయంలో కేకే మీడియా ముందుగానే గవర్నర్ కోటాలో శంకరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని తెలిపింది