మిర్యాలగూడ కేకే మీడియా సెప్టెంబర్ 26
తెలంగాణలో కాంగ్రెస్ ఉద్దండడు అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉండటం లేదన్న సంకేతాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక లో దరఖాస్తు చేసుకోకపోవడం తన కుమారులు కుందూరు రఘువీర్ రెడ్డి , జై వీర్ రెడ్డిలు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మిర్యాలగూడ ,సాగర్ నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకోవడంతో రెండు నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ జాతీయ అధిష్టానం ఒక కుటుంబానికి ఒకటే సీట్ అన్న నిబంధన పెట్టడంతో ఎవరికి అవకాశం లభిస్తుందో అన్న సందేహంలో అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. జానారెడ్డి మాత్రం తన ఇద్దరు కుమారులకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నప్పటికీ పార్టీ నిర్ణయంకి కట్టుపడాలని చెబుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం లలో మొత్తం దంపతులకు అవకాశం కల్పిస్తే మా కుమారులు ఇద్దరికీ కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. కానీ ఉత్తమ్ దంపతులు ఇరువురు గతంలో అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు కాబట్టి జాతీయస్థాయిలో ఉన్న నిబంధన వర్తించదని పార్టీలోని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి జానారెడ్డి సాగర్ నుండి పోటీ చేయకుంటే ఇద్దరు కుమారుల్లో ఒకరికి మాత్రం ఖచ్చితంగా సాగర్ స్థానం దక్కే అవకాశం ఉంది ఇక మిర్యాలగూడ విషయానికి వస్తే ఇప్పటికే అక్కడ బత్తుల లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, శంకర్ నాయక్ మరికొందరు పోటీ పడుతుండడం అధికార బీఆర్ఎస్ తో పొత్తు వికటించి కాంగ్రెస్తో పొద్దు పొడుస్తున్న కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే సిపిఎం పార్టీ నుండి మిర్యాలగూడ స్థానాన్ని కచ్చితంగా కోరే అవకాశమున్నందున రఘువీర్ ,జై వీర్ లలో ఒక్కరికే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అధిష్టానం టిపిసిసి రేవంత్ తో రఘువీర్ ,జై వీర్ లతో ఉన్న వ్యక్తిగత సంబంధాలతో బుజ్జగించి సాగర్ నుంచి ఒక్క టికెట్ తో సరి పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ జాబితా కసరత్తు నేపథ్యంలో పూర్తి అభ్యర్థుల ప్రకటన వెలువడేంత వరకు వారిరువురి అభ్యర్థిత్వం సస్పెన్స్ గానే ఉండబోతోంది