హైదరాబాద్ కేకే మీడియా ఆగస్ట్ 29:
అమర్ సొసైటీలో తాను ఇల్లు కొనుగోలు చేసినపుడు .. ఆ ఇల్లు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న విషయం తనకు తెలిదని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. తనకు అందిన నోటీసులపై ఆయన స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో ఇల్లు కొన్నానని చెప్పారు. అక్రమ నిర్మాణము అని తేలితే అధికారులు వెంటనే కూలగొట్టవచ్చని ఆయన స్పష్టంచేశారు.