నేరేడుచర్ల కేకే మీడియా జూన్ 8:
ఎన్నిసార్లు గెలిచామన్నది ముఖ్యం కాదు మరోసారి ఎన్నికల్లో గెలిచిన గెలవకపోయినా అవకాశం వచ్చినప్పుడు చేసిన పనులే పది కాలాలపాటు ప్రజల గుండెల్లో గుర్తిండి పోతాయని హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రాత్రి నేరేడుచర్ల ఆవాస గ్రామమైన నరసయ్య గూడెం చెరువు కట్టపై జరిగిన చెరువు పండగ కార్యక్రమంలో ముఖ్యంగా అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దే అన్నారు. కెసిఆర్ రాష్ట్ర అభివృద్ధితోపాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరి చేశారని అందులో నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో 30 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేయడం జరిగిందని అభివృద్ధి కోసం చేసే పనుల్లో కొందరికి ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో నేరేడుచర్ల అభివృద్ధికి చేసిన పనులు ఉపయోగపడతాయని అన్నారు. కొందరు అభివృద్ధిని ఆటంకపరిచేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని అనేక ఇబ్బందులు కలిగిస్తున్న అన్నింటినీ దాటుకుంటూ అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామని అభివృద్ధి సదావుగా జరిగితే మరికొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకువస్తానని. అభివృద్ధి కోసం పోటీ పడాలి తప్ప రాజకీయం చేయొద్దని గెలుపోటములు సహజమని ఎన్నిసార్లు గెలిచావు అన్నది ముఖ్యం కాదని గెలిచినప్పుడు చేసిన అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపదికన ప్రజల గుండెల్లో గుర్తిండి పోవాలని భవిష్యత్తు తరాలు చేసిన అభివృద్ధిని చెప్పుకున్నప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిదని అన్నారు. ముదిరాజుల కోసం మత్స్యశాఖ మార్పులు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి పాటుపడిన ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమని. మిషన్ కాకతీయ ద్వారా చెరువు కూడికలు పునరుద్ధరణ పనులు చేసి సాగుకు రైతన్నకు అండగా నిలిచేందుకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందన్నారు. ఆరు నెలల్లో నరసయ్య గూడెం చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామని తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ జయ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నరసయ్య గూడెం గ్రామం నుండి చెరువు కట్ట వరకు బోనాలు బతుకమ్మల మేళతాళాలతో ప్రజలు స్వాగతం పలకగా చెరువులో పూజలు నిర్వహించిన అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో మత్స్యశాఖ అధ్యక్షులు పేరబోయిన వీరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల శ్రీలత రెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి ఐదో వార్డ్ కౌన్సిలర్ అలక సరిత పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు