హుజూర్నగర్ కేకే మీడియా జూన్ 27:
నియోజకవర్గంలో ఏదో జరుగుతుందని ఏదో జరగబోతుందని అధికార ప్రతిపక్ష నాయకులు ఓటర్లు నానా యాగి చేస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల గుర్తుతో కూడిన ఆయిల్ పెయింటింగ్ లను చిల్లేపల్లి నుంచి చింతలపాలెం వరకు నియోజకవర్గంలోని ప్రధాన రహదారి మొదలుకొని పలు ప్రాంతాల్లో వేస్తున్నారు. దీంతో హుజూర్నగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని అభ్యర్థిగా అధినాయకత్వం తన పేరే ప్రకటిస్తుంది అని అందులో ఎలాంటి సందేహము లేదంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో నియోజకవర్గంలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచార
ఉధృతికి అడ్డు కట్టబడినట్లు అయింది. దీనికి తోడు ఉత్తం సోమవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని కలవడం తాను పార్టీ మారుతున్నానని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆవేశపడడం హుజూర్నగర్ నియోజకవర్గం నాదేనని తెలపటం ఉత్తం మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి గానే బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొక పోటీ తయారైన ఓజో ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్న పిల్లుట్ల రఘు హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాబోయే ప్రధాన పార్టీ అభ్యర్థి అన్న ప్రకటనతో కూడిన ఆయిల్ పెయింట్లను ఇప్పటికే నియోజకవర్గంలో వేయించి ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు ఇక వేళాయరా అన్నట్టుగా ప్రచారం కనిపిస్తోంది