హుజూర్నగర్ కేకే మీడియా నవంబరు 27
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికల నోడల్ అధికారి,జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు అన్నారు.ఈ నెల30 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అదనపు ఎస్పీ,ఎన్నికల నోడల్ అధికారి మేక నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం హుజూర్ నగర్ పట్టణంలో కేంద్ర బలగాలతో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యల లో భాగంగా పట్టణంలోని ఇందిరా సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు జిల్లా పోలీస్ సిబ్బంది,పారా మిలిటరీ సిబ్బంది పోలీసు కవాతుని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల నోడల్ అధికారి జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు మాట్లాడుతూ పౌరులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూనడుచుకోవాలని ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడిన వివాదాలు,హింసత్మక ఘటనలు సృష్టించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ ప్రకాష్,హుజూర్ నగర్ సిఐ రామ లింగారెడ్డి,ఏడు మండలాల ఎస్సైలు,సిబ్బంది, పాల్గొన్నారు