చింతలపాలెం కేకే మీడియా ఫిబ్రవరి 19
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఎద్దుల పందాలను ఆదివారం నాడు హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అధికారికంగా ప్రారంభించారు. చింతలపాలెం మండలంలోని చింతిర్యాల గ్రామంలో వృషభ రాజుల బండలాగుడు క్రీడలను ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రైతులు ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ క్రీడలకు గౌరవ శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి తమ చేతుల మీద వృషభ రాజుల కు పూజ చేసి క్రీడలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది
అనంతరం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని,మరియు నీలకంఠేశ్వర స్వామి వార్ల దేవాలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలను చేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో చింతలపాలెం మండల మరియు చింత్రియాల గ్రామ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, పాల్గొనడం జరిగింది