Friday, March 21, 2025
HomeTelanganaఎడమ కాలవ కట్టలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

ఎడమ కాలవ కట్టలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ కే కే మీడియా జూన్ 11

నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్టలు అస్తవ్యస్తంగా మారాయని ప్రభుత్వానికి, ఎన్ ఎస్పీ అధికారులకు కళ్ళు కనిపించడం లేదా అని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ఆదివారం మండలంలోని ఇలాపురం,
అన్నపురెడ్డిగూడెం గ్రామాలలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న ఏడవ కాలువ కట్టలను రైతులతో కలిసి పరిశీలించారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు కాలువలలో నడిచి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. లిఫ్టులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న యాద్గారి పల్లి మేజర్ కాల్వ కట్టను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఎడమ కాలువ ఆయకట్టు లైనింగ్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు కాల్వ ఆధునికరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదని కాల్వ మధ్య, మధ్యలో లైనింగ్ పనులు వదిలేసారని చెప్పారు మిర్యాలగూడ మండలంలోని ఐలపురం, అన్నపురెడ్డిగూడెం కాలువల మధ్యలో సుమారు మూడున్నర కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులు చేపట్టకపోవడంతో కాల్వకట్టలు బలహీనంగా మారాయన్నారు. పంటలకు సాగునీరు విడుదల చేసే సమయంలో కాల్వ కట్టలు కోతకు గురై గండ్లు పడే అవకాశం ఏర్పడిందన్నారు. వర్షాకాలం సమయంలో కాలువకు గండ్లు పడి పంట పొలాలు, కాలనీలు ముంపు గురై ప్రమాదం ఉందని చెప్పారు గతంలో కూడా కాలువకు గండ్లు పడి పంట పొలాలు కాలనీలు మునిగిపోయాయని దీనివల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మరో రెండు నెలలు వానాకాలం సీజన్ రాబోతుందని బలహీనంగా ఉన్న కాల్వకట్టను ఇలాగే వదిలేస్తే ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పారు ఈ రెండు నెలల కాలంలో మిగిలిపోయిన లైనింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కాలువ కట్టల పరిస్థితిపై ఎన్ఎస్పి అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి లైనింగ్ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో లిఫ్టు రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలో మన లిఫ్తులను మనమే నిర్వహించుకుందామని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్టంలో లిఫ్టులను పట్టించుకోకుండా ఉండటం సరైనది కాదన్నారు.. లిఫ్టులు పనిచేయకపోవడతో లిఫ్ట్ రైతులకు నీళ్లు పూర్తిస్థాయిలో అందటం లేదన్నారు. ఎల్ 11,12, ఎల్13,14 లలో తూములను కిందికి దించాలన్నారు. లిఫ్ట్ మరమ్మతులను వెంటనే చేపట్టి, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. కాలువ లైనింగ్ పనులు, లైఫ్తులను మరమ్మతులు చేపట్టకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సహయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, వేములపల్లి వైసీపీ పాదూరి గోవర్ధన, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్వాయి రామ్ రెడ్డి,కోట్ల శ్రీనివాస్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు రొంది శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు పొలేపల్లి గోవింద్ రెడ్డి, లిఫ్ట్ చేర్మెన్ పూర్ణచందర్రావు, ప్రణీత్ రెడ్డి, పొదిలా వెంకన్న, మల్లయ్య, కోడైరెక్క మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments