హుజూర్నగర్ కే కే మీడియా ఆగస్టు 15:
ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర వేడుకలని హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జ్ మారుతి ప్రసాద్ అన్నారు. మంగళవారం హుజూర్నగర్ కోర్ట్ ఆవరణలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో జెండా వందనం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ వర్తకానికి వచ్చిన బ్రిటిష్ వ్యాపారులు 200 ఏండ్ల పాటు మనని పాలించగా వారిని తరిమికొట్టేందుకు ఎందరో మహానుభావులు తమ పోరాటాలతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు. చిన్నప్పుడు పాఠశాలల్లో కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒక పండుగ అనుకుని చాక్లెట్లు బిస్కెట్ల తో ఆనందపడే రోజుల నుంచి జెండా ఎగురవేసే స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్క దేశంలో మన భారతదేశ ఉన్నతి గొప్పదని విభిన్న కులాలు, మతాలు జాతులు ఎన్ని ఉన్న అందరికీ స్వతంత్ర ఫలాలు సమానంగా ఉండాలన్న సమైక్యభారత లక్ష్యం చాలా గొప్పది అన్నారు.
హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన సిర్పూర్ కాగజ్నగర్ లో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న రవికుమార్ సెలవులో సొంత ప్రాంతానికి రావడంతో హుజూర్నగర్ కోర్టు ఆవరణలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ సెలవులో సొంత ప్రాంతానికి ఇక్కడికి వచ్చి సొంత ప్రాంతంలోని కోర్టు ఆవరణలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇదే కోర్టులో క్లర్క్ గా జూనియర్ న్యాయవాదిగా పనిచేసే ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని ఉన్నత స్థానం సాధించడం అంత కష్టమైన పని కాదని కష్టపడి పని చేసే దేనినైనా సాధించవచ్చు అని అన్నారు.
హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి బహుమతి ప్రధానోత్సవం చేశారు