నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 6:
వాసవి వనిత క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవం , జర్నలిస్టుల దినోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని వివిధ పత్రికలలో పనిచేసే విలేకరులను, వివిధ ప్రైవేటు పాఠశాలల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు
ఘనసన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాసవి క్లబ్ వైస్ డిస్టిక్ గవర్నర్ రాచర్ల కమలాకర్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రాచకొండ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నేరేడుచర్లలో వాసవి వనిత క్లబ్ నిరంతర కార్యక్రమాలతో సమర్ధవంతమైన మంచి క్లబ్బులు గా గుర్తింపు పొందాయని వారి సేవలకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల వాసవి క్లబ్ అధ్యక్షులు కొత్త లక్ష్మణ్, వనిత క్లబ్ అధ్యక్షులు వీరవల్లి శ్రీలత వాసవి వనిత సభ్యులు పోలిశెట్టి సంధ్య గజ్జల కోటేశ్వరరావు కంది బండ శ్రీనివాసరావు పోలిశెట్టివెంకటేశ్వర్లు చిత్త నురి సత్యనారాయణ కందిబండ హరిప్రసాద్ గొల్ల సుధాకర్ టిఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు