Sunday, September 8, 2024
HomeTelanganaఉత్తంపై వదంతుల జోరు.... కార్యకర్తల బేజారు

ఉత్తంపై వదంతుల జోరు…. కార్యకర్తల బేజారు

హుజూర్నగర్ కేకే మీడియా జూన్ 23:
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుమ కొత్త నాయకుల చేరికలు సందిగ్ధంలో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వచ్చే వలసలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించిన నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గం లోని రాజకీయాలు వేడెక్కాయి.
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం ఎంపీగా ఎక్కువకాలం టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన జాతీయస్థాయిలో కాంగ్రెస్లో పట్టున్న నేతగా గుర్తింపు ఉన్న నల్లగొండ పార్లమెంటు సభ్యుడు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై గత సంవత్సర కాలంగా ఇటు నియోజకవర్గంలో పాటు రాష్ట్రస్థాయిలో పలు అనుమానాలతో కూడిన చర్చలు తీవ్ర రూపం దాల్చాయి. వేదికలపై పత్రికా ముఖంగా బహిర్గతం చేయనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి తనకు మధ్య గ్యాప్ పెరిగిందన్న ఊహాగానాల నేపథ్యంలో గతంలో జాతీయస్థాయిలో బలంగా ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ తిరిగి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ నుంచి
పార్టీలోకి ఆహ్వానించినట్లు గతంలో వార్తలు
గుప్పమ్మన్నాయి. నిజానికి అవకాశం వచ్చిన సున్నితంగా తిరస్కరించినట్లు ఉత్తమ్ కు అత్యంత విశ్వసనీయమైన అనుచరుల సమాచారం.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు తనపై వస్తున్న ఆరోపణలు విమర్శలు నేపథ్యంలో గత వై ఎలక్షన్ సమయంలో అధికారం టిఆర్ఎస్ పార్టీతో కుదిరిన ఒప్పందం మేరకే హుజూర్నగర్ నియోజకవర్గంలో తన సతీమణి నిలబెట్టిన ఓడిపోవడం జరిగిందని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగి కార్యకర్తలు కొంత నైరాశానికి లోనైన పరిస్థితి. ప్రస్తుతం హుజూర్నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి అధికారంలో ఉండగా ఉప ఎన్నికల్లో నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న నేపథ్యంలో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి నిధుల తో పాటు అన్ని శాఖలకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ చొరవ చూపి నిధులు తీసుకువస్తున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి దిటుగా నాయకులు కార్యకర్తల కోరికతో పాటు నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక పర్యటనలు చేస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేసినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి ఉత్తమ్ కు మధ్య జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర పార్టీతో పాటు కేంద్ర కాంగ్రెస్ సైతం ఉత్తంకు ఎంపీ సీటు, భార్యకు ఎమ్మెల్యే సీటు మాత్రమే ఇస్తారని, రెండు ఎమ్మెల్యే స్థానాలు తనకే కావాలని ఉత్తమ్ పట్టుపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇలా చేయటానికి ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కారణమని దానికి నిరసనగా ప్రస్తుతం టిఆర్ఎస్లోకి ఉత్తం వెళుతున్నట్లుగా వారం రోజుల్లో పార్టీలో చేరుతున్నట్లుగా గత మూడు రోజుల నుండి ఇటు కాంగ్రెస్ శ్రేణులు అటు టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల లో చర్చ కొనసాగుతోంది.
టిఆర్ఎస్ తో జరిగిన చర్చల్లో భాగంగా పద్మావతికి కోదాడ టికెట్ తో పాటు ఉత్తంకి ఎంపీ టికెట్ మరియు తను కోరుకున్న వ్యక్తికి హుజూర్నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ఊహాగానాలు నియోజకవర్గంలో చక్కెర్లు కొడుతున్నాయి. తనపై అభిమానంతో ఉన్న ముఖ్యమైన కార్యకర్తలు ఈ విషయంలో ఎన్ని ఫోన్లు చేసిన వదంతులు నమ్మొద్దు అంటూ ఉత్తం చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ తో రాజకీయాలపై అసహనం వ్యక్తం చేసి త్వరలో రిటైర్ అవుతున్నట్లు చెప్పినట్లుగా వార్తలు గుప్పుమన్న ప్రస్తుత రాజకీయాల పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశానని దానిని వక్రీకరించి చిట్ చాట్ లో మాట్లాడిన అంశాలను బయటకు బహిర్గతం చేయడం తప్ప అలాంటి ఆలోచన తనకు లేదని పోటీలే ఉండబోతున్నానని స్పష్టం చేశారు.
పలుమార్లు ఉత్తం హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రతి మీటింగులో 50వేల పైచిలుకు మెజారిటీతో హుజూర్నగర్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం గెలుపొందుతానని లేదంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని చాలెంజ్ విసురుతూ ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దానికి దీటుగా 50 వేల మెజారిటీ నికానాక తేల్చుకుందాం నీవే పోటీ చేయాలంటూ పలు మీటింగుల్లో టీవీ చానల్స్ ఇంటర్వ్యూలలో సవాల్ విసురుతున్న ప్రస్తుత తరుణంలో ఉత్తం టిఆర్ఎస్ వైపు వస్తే తమ భవిష్యత్తు ఏందని టిఆర్ఎస్ నేతలు గుబులు పడుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీధితోందని కాంగ్రెస్ కి అధికారం వచ్చే అవకాశం ఇటు రాష్ట్రంలో ఒక కేంద్రంలో ఉన్న నేపథ్యంలో నేతలు మారిన కార్యకర్తలుగా కాంగ్రెస్ని గెలిపించుకుందామన్న చర్చ బలంగా జరుగుతుందని తెలుస్తోంది.
ఉత్తం పార్టీ మారతారన్న వదంతులను హుజూర్నగర్ కోదాడ శాసనసభ్యులు ఇతర ముఖ్య నాయకులు ఉత్తంని రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఉత్తం బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ని వీడి ఉత్తం రాష్ట్రానికే పరిమితమైన టిఆర్ఎస్లోకి ఎలా చేరుతారని అనుచర గణం బలంగా వాదిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ ఊహలకు, వ్యక్తిగత అభిప్రాయానికి ఎలాంటి పొంతనలు ఉండవని, గాలి దూరే సందున్న రాజకీయాల్లో ఇలాంటి వార్తలే ఇలాంటి ఊహాగానాలే ఇలాంటి ఆరోపణలే వస్తూ ఉంటాయని ఇక రాజకీయాల్లో అయితే ఇలాంటివి సర్వసాధారణమని విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు.
ఉత్తం బహిరంగంగా వ్యక్తపరిస్తే తప్ప ఇలాంటి పరిణామాలు ఉండకపోవచ్చు అనేది భావన
హుజూర్నగర్ నియోజకవర్గంలో అటు కోదాడ నియోజకవర్గంలో కార్యకర్తల్లో కొంత ఆందోళన ఉన్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం బలంగా తమ పార్టీ అధికారంలోకి రావాలని కసిగా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత పది ఏళ్లుగా అధికారంలో లేకపోయేవరకు ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఇప్పటికే వారి ప్రయత్నాల్లో వారి కేడర్ ని సమాయత్తం చేసుకుంటున్నారు. నాయకులు మారినా కార్యకర్తలు కాంగ్రెస్ క్యాడర్ మాత్రం కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments