హుజూర్నగర్ కేకే మీడియా జులై 20
నల్లగొండ పార్లమెంట్ ఎంపీ నలమాల ఉత్తంకుమార్ రెడ్డి పై పుకార్ల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న ఉత్తంకుమార్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తన గౌరవానికి భంగం కలిగించేలా కొంతమంది చేస్తున్న కుట్రను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ఇరువురి మధ్య పెరిగిన గ్యాప్ రాజకీయంగా ఉత్తంపై పలు ఆరోపణలు అనుమానాలు పుకార్లు షికార్లు అవుతూ వచ్చాయి.
ప్రస్తుత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తంపల్లి సందర్భంలో హుజూర్నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ 50వేల మెజారిటీ పైన గెలుపొంద కుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ చెబుతూ వచ్చిన నేపథ్యంలో తన సతీమణి కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం కుటుంబంలో ఇరువురికి అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోవచ్చు అని మళ్లీ ఉత్తంకి ఎంపీగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందంటూ తను మాత్రం అసెంబ్లీ బరిలోనే దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు ఇవ్వడంతో అప్పటినుండి పుకార్లు షికార్లుగా చక్కర్లు కొడుతున్నాయి.
ఉత్తం టిఆర్ఎస్ పార్టీలోకి మారతాడంటూ గత కొంతకాలంగా జరుగుతున్న పుకార్లు పలు సందర్భాల్లో ఉత్తం వాటిని ఖండిస్తున్న ఇదిగో అదిగో టిఆర్ఎస్లోకి వెళుతున్నాడు అంటూ ప్రచారాలు ఆగకపోవడం నియోజకవర్గంలోని నాయకులకు సరైన సమాచారం లేకపోవడంతో కొంత అయోమయానికి గురవుతున్నారు.
జూలై 24న సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సమక్షంలో టిఆర్ఎస్లోకి వెళ్తారని లేదంటే వానాకాలం సమావేశాల అనంతరం పార్టీ మారతారని ఇప్పటికే తన సన్నిహితులతో ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులతో చర్చలు జరిపారంటూ వస్తున్న పుకార్లను ఆయన అభిమానులు ఖండిస్తున్నప్పటికీ ఉత్తంపల్లి సందర్భాల్లో నామీద ఎవరో కక్షపూరితంగా కావాలని ఇలా విష ప్రచారం చేస్తున్నారని చెబుతున్నప్పటికీ పుకార్ల జోరు మాత్రం ఆగడం లేదు.
పార్లమెంటు సమావేశాల అనంతరం హుజూర్నగర్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తను ఉండబోతున్నట్టు హుజూర్నగర్ గడ్డపై తను స్పష్టమైన మెజారిటీతో గెలుస్తానని పార్టీ మారే ఆలోచన తనకు లేదని తన దగ్గరకు వచ్చిన నాయకులకు చెబుతున్నప్పటికీ రాజకీయాలు కదా రేపు ఏం జరుగుతుందో అన్న ఆసక్తికర చర్చ నియోజకవర్గంలో కొనసాగుతోంది