హైదరాబాద్ కేకే మీడియా మార్చి 22
తెలుగు వారందరూ నూతన సంవత్సరంగా భావించి ఎంతో సుఖసంతోషాలతో కుటుంబ సభ్యుల నడుమ గడుపుకునే పండగ ఉగాది . ఈ ఉగాదినాడు ప్రతి ఒక్కరి ఇంట షడ్రుషుల మిల్లితమైన ఉగాది పచ్చడి చేసుకొని ఆరగీస్తారు అట్టి ఉగాది రుచుల గొప్పతనం
“ఉగాది”నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి.
ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి
కొత్త #బెల్లం ఆకలిని కలిగిస్తుంది.
#చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
#పచ్చిమిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.
#మామిడి_ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.
#వేప_పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.
ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం
ఒకటిన్నర కప్పు నీరు.
రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు.
కొద్దిపాటి వేప పువ్వులు.
మూడు టేబుల్ స్పూన్ల బెల్లం.
తగినంత ఉప్పు.
రెండు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు
ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం.
ఉగాది పంచాంగ శ్రవణం
ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి. వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ పఠనాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వింటారు.
అందుకే ప్రతి ఒక్కరి ఇంట ఈ ఉగాది పచ్చడి