హుజూర్నగర్ కేకే మీడియా ఏప్రిల్ 12:
హుజూర్నగర్ లో చిన్నతనంలో చదువుకునేటప్పుడు చెప్పులు లేకుండా తిరుగాడిన ప్రాంతాల ఎన్నో గుర్తులు
హుజూర్నగర్ ప్రాంతంలో ఉన్నాయి అని నూతనంగా హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పాత హుజూర్నగర్ తాలూకా ప్రాంతమ్ తొగర్రాయి లో పుట్టి హుజూర్నగర్ లో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకొని హైకోర్టులో ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడ్డాను అని కష్టంతోనే ఎంతటి ఉన్నత శిఖరాలైన అధిరోహించొచ్చని ఈ ప్రాంత వాసిగా నా మీద ప్రేమాభిమానాలతో పిలిచి ఇంతటి ఘన సత్కారాన్ని చేసిన ఈ కార్యక్రమాన్ని జీవితంలో మరిచిపోలేను అని పల్లె నాగేశ్వరరావు అన్నారు . హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాంరెడ్డి మాట్లాడుతూ గెలుపు ముందే ఖాయమని చెప్పానని విజేతగా హుజూర్నగర్ కోర్టుకు రావాలని కోరాలని హైకోర్టు చరిత్రలో భారతదేశంలో మొదటి దళిత భారత శిక్షణ అధ్యక్షుడిగా చరిత్ర పుటల్లో మన ప్రాంత వాసి నిలిచిపోవడం గర్వకారణం అని అన్నారు.
కార్యక్రమంలో హుజూర్నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు నాగేశ్వరరావు తో చదువుకున్న మిత్రులు కోర్టు సిబ్బంది ఘనంగా సన్మానించారు