ఇష్టారాజ్యంగా స్టోన్ క్రషర్లు గాలి, నీరు, నేల కలుషితం
*రాపోలు నవీన్ కుమార్
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి కేకే మీడియా జనవరి 18
గరిడేపల్లి మండల కేంద్రం లో స్థానిక మండల రెవిన్యూ కార్యాలయం లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గరిడేపల్లి నాయబ్ తహసీల్దార్ కి ఇష్టారాజ్యంగా నడుస్తున్న స్టోన్ క్రషర్లు మీద చర్యలు తీసుకోవాలి అని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో నియోజకవర్గం ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ
కొండల్ని పిండి చేసేస్తున్నారు.. నేల, నీరు కూడా కలుషితమవుతున్నా వారికి లెక్కలేదు.. నిబంధనలకు తూట్లు.. ఇదీ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో కంకర మిల్లుల (స్టోన్ క్రషర్లు) పరిస్థితి. క్రషర్లు, హాట్ మిక్స్ ప్లాంట్లతో గాలి, పొలాలు, నీటి వనరులూ కాలుష్యం బారిన పడుతున్నాయి అని
భూకంపం తలపించేలా బ్లాస్టింగ్లు చేస్తున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు అని బ్లాస్టింగ్ శబ్దాలతో ఊళ్లోలో ఇండ్లు నెర్రెలమయం అవుతుంది అని
శబ్దాలతో.. ఇండ్లలో సామాగ్రి నేలపాలు అవుతుంది అని నిత్యం భయాందోళనలో గ్రామస్తులు గడుపుతున్నారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ అధ్యక్షులు జీలకర్ర రామస్వామి, గరిడేపల్లి మండల అధ్యక్షులు అమరవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు