కేకే మీడియా ఆగస్టు 30 కనిగిరి
పాత నేరస్తులను విచారిస్తుంటే 23 లక్షలు విలువ చేసే 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న ఘటన కనిగిరి లో వెలుగులోకి వచ్చింది .కనిగిరి డిఎస్పీ రత్నాకరం రామరాజు శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి కేసులో పాత నేరస్తులైన కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన మల్లెల కొండారెడ్డి ,గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన పనుమర్తి లక్ష్మి నారాయణ వరప్ చింతం నాగభూషణం లను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా బైకుల దొంగతనం వెలుగులోకి వచ్చిందన్నారు .దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 23 లక్షలు విలువ చేసే 28 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వివరించారు .మోటారు సైకిళ్ళు రికవరీలో ప్రతిభ కనబరచిన ఎస్సై టి త్యాగరాజు ,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ,కానిస్టేబుల్ శోభన్ బాబు లను డిఎస్పీ అభినందించారు .ఈ సమావేశంలో సీఐ షేక్ ఖాజావలి ,ఎస్సై టి త్యాగరాజు ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు .