న్యూఢిల్లీ కేకే మీడియా ఫిబ్రవరి 25:
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య శ్రీమతి సోనియా గాంధీ ఇక రాజకీయాలకు సెలవంటూ ప్రకటన చేశారు. పది సంవత్సరాలు యూపీఏ కు చైర్మన్గా వ్యవహరించి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధానమంత్రి పదవిని సైతం పక్కనపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో పార్టీని పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ఇక రాజకీయాలకు సెలవు ప్రకటించారు. రాహుల్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఇటీవల జాతీయ అధ్యక్ష స్థానాన్ని మల్లికార్జున ఖర్గే నియామకం తర్వాత అటు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ దేశ రాజకీయాల్లో తమ తమ కర్తవ్యాలు పార్టీ ఉన్నతి కోసం పాటుపడుతున్న నేపథ్యంలో వయోభారం ఆరోగ్యం నేపథ్యంలో రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించారు.