సూర్యాపేట కేకే మీడియా నవంబర్ 10
కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగడిన పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం నాడు తన అనుచరుల తో పారి ర్యాలీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనుచరుడుగా సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిత్వం తనకే లభిస్తుందని కోటి ఆశలతో ఉన్నప్పటికీ చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానం సూర్యాపేట టికెట్ను కేటాయించడంలో జాప్యం చేసి చివరగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కే టికెట్ కేటాయించడంతో తీవ్ర నిరాశలో ఆవేదనతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే మోసం చేసిందని ఆవేదన చెందుతూ త్వరలో అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించుకుంటామని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్లో ఫోటా ,పోటీ అభ్యర్థులుగా ఉన్న రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు ఇద్దరు గా విడిపోవడం బిఆర్ఎస్కు లబ్ధి చేకూరుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.