A P తిరుపతి జిల్లా చిలకురు కే కే మీడియా ఆగస్ట్ 29:
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడగా సుమారు 35 మంది ప్రయాణికుల్లో 5 మందికి తీవ్రగాయాలు,కొందరికి స్వల్ప గాయాలు.
గాయపడిన ప్రయాణికులను మీనాక్షి పవర్ ప్లాంట్ కి సంబంధించిన అంబులెన్స్ లో దగ్గర్లోని ఆసుపత్రులుకు తరలింపు.
నెల్లూరు నుండి ముత్తుకూరు మీదుగా కోటకు వస్తున్న ఆర్టిసి బస్సు మోమిడి గ్రామం దాటగానే అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా కొట్టింది ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలు మరికొంత మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం, గాయపడ్డ వారిని స్థానికులు సహాయంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం….