మిర్యాలగూడ కేకే మీడియా ఆగస్టు 26
మిర్యాలగూడ పట్టణ పరిదిలో TUFIDC నిధులు 6 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు శంకుస్థాపన చేశారు . శనివారం మిర్యాలగూడ పట్టణంలో TUFIDC నిధులు 3 కోట్ల రూపాయలతో వై జంక్షన్, నందిపహాడ్ జంక్షన్ తో మరో 3చోట్ల నూతన స్వాగత తోరణాలకు (ఆర్చ్), 3 కోట్ల నిధులతో నందిపహాడ్ జంక్షన్, ఈదులగూడ జంక్షన్ తో పాటు మరో 3 జంక్షన్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నెలమోతు భాస్కరరావు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి శంకుస్థాపన చేసారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్ రావు, మున్సిపల్ అధికారులు, బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…