హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 26:
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 70 కి పైగా స్థానాలు గెలుచుకొని అధికారాన్ని చేపట్టబోతోందని
హుజూర్నగర్ నియోజకవర్గం లో 50 వేల మెజారిటీ లక్ష్యంగా ప్రతి ఆఫీస్ బేరర్ పనిచేయాలని హుజూర్నగర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రస్తుత నల్లగొండ పార్లమెంటు సభ్యుడు హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు
శనివారం హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో MP కెప్టెన్ ఉత్తమ్ పాల్గొని ప్రసంగించారు.
నియోజకవర్గంలో . కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులందరూ తప్పనిసరిగా చురుకుగా పాల్గొనాలి & రేపటిలోగా వారి పట్టణాలు/గ్రామాల్లో దానిని పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రతి 100 మంది ఓటర్లలో ఒక ఓటరును ఎంపిక చేసి 100 మంది ఓటర్లకు సమన్వయకర్తగా నియమించాలన్నారు.. హుజూర్‌నగర్‌లో కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
. తెలంగాణలో కాంగ్రెస్ 70 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు
తెలంగాణ ప్రజానీకం టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, భూకబ్జాలు, అక్రమాలతో విసిగిపోయారన్నారు.. రాబోయే 90 రోజులు అందరూ కష్టపడి పనిచేయాలని అభ్యర్థించారు. ఎన్నికలు అయ్యేంతవరకు కలిసికట్టుగా నియోజకవర్గంలో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కృషి చేయాలని పలు సూచనలతో దిశా నిర్దేశం చేశారు.