భాషను వ్యతిరేకించేది అందుకే UP సీఎంకు స్టాలిన్ కౌంటర్
తమిళనాడులో జరుగుతున్న ద్విభాషా ఉద్యమం న్యాయం, గౌరవం కోసమే తప్ప ఓట్ల కోసం కాదని సీఎం స్టాలిన్ స్పష్టతనిచ్చారు. తాము ఏ భాషను వ్యతిరేకించట్లేదని బలవంతంగా తమపై రుద్దడాన్నిమాత్రమే అడ్డుకుంటున్నామని తెలిపారు. ఓట్ల కోసమే NEPని వ్యతిరేకిస్తున్నారని UP సీఎం ఆరోపణలకు X వేదికగా స్టాలిన్ కౌంటరిచ్చారు. డీలిమిటేషన్, ఎడ్యుకేషనల్ పాలసీలపై రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం బీజేపీ నేతలను కలవరపెడుతోందని తెలిపారు.