నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 8:
మన ప్రాంతంలో ఆదర్శ రాజకీయాలతో పేరు తెచ్చుకున్న గొప్ప నాయకుడు అరిబండి లక్ష్మీనారాయణ అని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం నేరేడుచర్ల లో ఆదర్శ నేత అరిబండి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు ఆరిబండి లక్ష్మీనారాయణ జీవిత చరిత్ర పుస్తకాన్ని వారి మనవడు సుంకర క్రాంతి కుమార్ అందజేసిన అనంతరం మాట్లాడుతూ నిస్వార్ధ రాజకీయ నాయకుడిగా రెండు పర్యాయాలు మన ప్రాంతంలో శాసనసభ్యుడుగా సేవలు అందించి నిరాడంబర జీవితంతో ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన వెంట డాక్టర్ సాహితి, నాగండ్ల శ్రీధర్ చందమల్ల జయ బాబు రాపోలు నరసయ్య , సురేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు