గరిడేపల్లి కేకే మీడియా మార్చి 21
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని గరిడేపల్లి మండల పార్టీ బిఆర్ఎస్ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 న జరుగు గరిడేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనకు పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పెండం శ్రీనివాస్ గౌడ్.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు జోగ్ అరవింద రెడ్డి ప్రధాన కార్యదర్శి ఒక్క వంతుల పార్థసారధి పిఎసిఎస్ చైర్మన్లు, మండల పార్టీ యూత్ అధ్యక్షులు మండవ నాగేశ్వరరావు పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గందె వినోద మండల సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్స్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.