ఆటోను అడ్డగించి నగదు, బంగారం దోపిడి
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 31
సోమవారం తెల్లవారు జామున నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నె గ్రామానికి చెందిన బెందు వీరబాబు కూరగాయలు మిర్యాలగూడ మార్కెట్ లో తేవడానికి తన ఆటో లో పెంచికల్డిన్నే గ్రామం నుండి తెలగరామయ్య గూడెం మీదుగా వెళ్తుండగా బోడలదీన్నే గ్రామ శివారుకి వెళ్ళేసరికి, ఆటో వెనక నుంచి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి ఆటోను అడ్డగించి వీరబాబును ఆటో లో నుంచి బయటకి లాగి, బెదిరించి అతని వద్ద నుండి 15వేల రూపాయలు, 6 గ్రాముల బంగారు ఉంగరాన్ని తీసుకున్నారు. ఈ సంఘటనపై ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నేరేడుచర్ల ఎస్సై పి.పరమేష్ చెప్పారు. సిఐ సూచన మేరకు నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.