నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో తెలంగాణలోనూ తెలుగు ఆనందోత్సాహాలు జరుపుకోగా నేరేడుచర్ల లోని తెలుగు తమ్ముళ్లు శనివారం రాత్రి ప్రధాన రహదారి పై బాణాసంచాలు కాల్చి పసుపు జెండాలతో సంబరాలు జరుపుకున్నారు
నేరేడుచర్ల మండల కేంద్రంలో తెలుగు దేశం పార్టీ నాయకులు , అభిమానులు నేరేడుచర్ల నడీకూడలిలో బాణాసంచా కాల్చి , స్వీట్స్ పంపిణీ చేసి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధర్మం , న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని , తెలంగాణ లో కూడా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకోవడం ఖాయమనీ వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో పాల్వాయి రమేష్ , పొనుగోటి జంగారావు , ఇంజమూరి వెంకటయ్య , సామ సైదులు చందమళ్ళ వెంకన్న , ఎనుగంటి పుల్లయ్య చౌదరి , చెరుకూరు మాల్యాద్రి , జింకల పిచ్చయ్య నాయుడు , యాళ్ల దశరధ , చెరుకుమల్లి కిశోర్ , నిమ్మగడ్డ సుబ్బారావు , కామళ్ళ అంజి , శివనేని శ్రీరాములు , బొల్లెద్దు నాగేష్ , సంకలమద్ది భిక్ష్మారెడ్ఢి , సామ నాగరాజు , బూషి గొవర్ధన్ , చింతల ఈశ్వర్, అల్లు నాగభూషణం , వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.