హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 24
ధనుర్మాస ఉత్సవాల్లో ఆంజనేయ స్వామికి 1008 తమలపాకుతో ప్రత్యేక పూజలు…
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో శ్రీవేణుగోపాల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిపించారు. దేవాలయంలోని ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపించి. సింధూరాన్ని అలంకరించి 1008 తమలపాకుతోప్రత్యేకంగా అలంకరించి సహస్ర నామార్చన పూజ వైభవంగా జరిగింది. ప్రాత కాలంలో భక్తుల గోత్ర నామాలతో విష్ణు సహస్రం, గోదా,రామానుజ అష్టోత్తరాలు చేశారు.మహిళలు తిరుప్పావైని శ్రావ్యంగా గానం చేసి,సాయంత్రం పల్లకిలో
ఉభయ దేవేరులైన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దేవాలయ ప్రదక్షణ కావించారు.మహా మండపంలో భద్ర పీఠంపై ఆంజనేయ స్వామి వేంచేసి పూజలు చేశారు.జైశ్రీరామ్,జై శ్రీమన్నారాయణ నినాదాల తో దేవాలయ ప్రాంగణం మారు మోగింది.ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణ అధికారి గుజ్జుల కొండారెడ్డి, అర్చకులు నరసింహచార్యులు,రాఘవాచార్యులు, భాస్కరాచార్యులు,భక్తులు పిచ్చమ్మ,వంకాయల పద్మ, రాణి, అశోక్,గుండా రమేష్,తదితరులు పాల్గొన్నారు.