విజయవాడ కేకే మీడియా జనవరి 22
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర సారధిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న విషయం విదితమే.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుందని ఆశపడిన తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను మారుస్తూ వస్తున్న ఎలాంటి ప్రయోజనం లభించకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు తో తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న జగన్ సోదరి షర్మిల ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో జాతీయ కాంగ్రెస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తుందని రాజ్యసభ సభ్యురాలుగా చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ పార్టీ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, జరగనుండగా షర్మిల కడప పార్లమెంటుకు పోటీ చేస్తుందని వార్తలు వెలువడినప్పటికీ అసెంబ్లీ బరిలోనే నుంచుంటారు అన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
షర్మిల అసెంబ్లీ బరిలో నిలబడితే ఎన్నో పర్యాయాలుగా కాంగ్రెస్ విజయం సాధించిన విజయవాడ తూర్పు స్థానం నుంచి కానీ, గుంటూరు పశ్చిమ స్థానం నుంచి కానీ లేదా రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ తన సత్తా చాటింగ్ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా కాంగ్రెస్ పావులు కలుపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.