హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 28;
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఓజో ఫౌండేషన్ చైర్మన్ విలుట్లకు తెలిపారు.
సోమవారం హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కోసం దరఖాస్తు చేసుకున్నానని ప్రజా బలం ఉన్న బీసీ నాయకుడిగా తనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుంది అన్న నమ్మకం ఉందని. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం రాకుంటే కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవకాశం ఇస్తే తప్ప మరి ఏ ఇతర ఆశ చూపిన వినేది లేదని తేల్చి చెప్పారు.
మూడు సంవత్సరాలుగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓజో ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చానని. ప్రస్తుతం హుజూర్ నగర్ లో ఎవరికి సహాయం కావాలన్నా నేనే గుర్తుకువస్తున్నాని రఘు చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని పలు స్కూళ్లు,గుళ్ళలో మౌళికవసతులు, పేద విద్యార్ధులకు పోటీ పరీక్షలకు కోచింగ్,ఆపదలో ఉన్నవారికి ఆర్ధిక సహాయం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నమాన్నారు..తన దగ్గరకు వస్తే అందరికి సాయం చేస్తాననే నమ్మకం ప్రజలకు కలిగిందన్నారు..
అన్ని పార్టీల నేతలు టచ్ లోనే..
తనకు అన్ని పార్టీల నేతలు టచ్ లోనే ఉన్నారని రఘు అన్నారు. ఆయా పార్టీలు నిర్వహించిన సర్వేలలో తనకు 30 నుండి 40 వేల ఓటు బ్యాంకు ఉందని తేలిందని,దానిని లక్ష ఓటింగ్ దిశగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నా రు.
కాంగ్రెస్ లో అవకాశం ఎక్కువ..
కాంగ్రెస్ పార్టీలోనే తనకు సీటు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని అన్నారు.బిజేపి. బిఎస్పీ టిడిపి.ఇంకా కొన్ని పార్టీలలో అవకాశం వస్తున్నప్పటికీ అటు వైపు వెళ్ళడం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇవ్వడానికి సభ్యత్వం అక్కర్లేదనీ.ఎన్నారైలు,సేవ చేసే స్వచ్ఛంద సేవకులకు సభ్యత్వం లేకుండానే అవకాశం కల్పిస్తారని,ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిసి అభ్యర్ధిగా పార్టీకి దరఖాస్తు చేసుకున్న ఏకైక వ్యక్తిని నేనే అని,తనకే అవకాశం ఉంటుదని ధీమా వ్యక్తం చేశారు.
చాప కింద నీరుల ఆపరేషన్ జరుగుతోంది..
నియోజకవర్గంలో బలం పెంచుకోవడానికి చాప కింద నీరుల నియోజకవర్గ వ్యాప్తంగా ఆపరేషన్ జరుగుతుందన్నారు.పరిస్థితుల దృష్ట్యా మద్దతిస్తున్న నాయకులు బయటకు రావడం లేదని,ఓటింగ్ సమయంలో అందరు సపోర్ట్ చేస్తారన్నారు.నాలాంటి యువతకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు.నియోజకవర్గంలో రిపేరులో ఉన్న లిప్టులకు అవసరమైతే స్వంత ఖర్చులతో మరమ్మత్తులు చేయిస్తామన్నారు.
ఎమ్మెల్యేగా నిలబడేది పక్క..
కాంగ్రెస్ పార్టీలో బీసీ కోటాలో హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశంలో ఇస్తుందని పూర్తి విశ్వాసం ఉందని ఒకవేళ రాకున్నా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువత యువకుడినైన నన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నామని. ప్రజల ఆశీర్వాదంతో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు