అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి : జడ్పిటిసి నరసయ్య
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 30
నేరేడుచర్ల మండలం సోమారం, దాచారం గ్రామాలలో శనివారం జరిగిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో జడ్పిటిసి రాపోలు నరసయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని
మాట్లాడుతు ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఈనెల 28 నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని,ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జ్యోతి పద్మ, డి. రఘు, తాసిల్దార్ సైదులు, ఎంపీడీఓ శంకరయ్య, ఎంపీవో విజయ కుమారి, ఏ ఈ శ్రీనివాసు, సబ్ ఇంజనీర్ గురవయ్య, సర్పంచులు వాడపల్లి రమణ నగేష్, రెడపంగా సుశీల నాగయ్య, ఎంపీటీసీ మధురవాణి, ఏఎస్ఐ సైదులు, ఉపాధి హామీ టి ఏ సతీష్ రెడ్డి, హెడు కానిస్టేబుల్ మురళి, పంచాయతీ కార్యదర్శులు కరుణ శ్రీ, సుజాత అంగన్వాడిలు, ఆశ వర్కర్లు, వి ఏ ఓ లు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.