జినేరేడుచర్ల కేకే వీడియో జనవరి 22
ఆలయాల్లో అయోధ్య రాముడు విగ్రహ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం..
అయోధ్య రాముడు అందరి దేవుడు
ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు
హనుమాన్ చాలీసా పారాయణం
అయోధ్య రాముడి ఆలయం
కోసం 500 సంవత్సరాలగా ఎదురుచూస్తున్న హిందువుల
కలలు సహకారమైన శుభవేళ మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రత్యేక పండుగ రాములోరి కళ్యాణాన్ని తలపించేలా కన్నుల పండుగగా ప్రత్యేక కార్యక్రమాలతో హిందువులు ఘనంగా నిర్వహించారు.
నేరేడుచర్ల పట్టణంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. నేరేడుచర్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయంలో సోమవారం అయోధ్య రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా
భగవద్భాజాన్ని ఏర్పాటు చేశారు
మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్థానిక యస్ ఐ పరమేష్ భగవత్ ద్వజాన్ని ఆవిష్కరించారు.
ఖమ్మం సుందరకాండ శ్రీనివాసరావు బృందo ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశారు. చక్కటి భక్తి పాటలతో సీతారామాంజనేయ పారాయణంతో భక్తులు పరవశించిపోయారు. జైశ్రీరామ్ నాదాలతో హోరెత్తించారు. ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి అయోధ్య రాముడి ప్రత్యక్ష ప్రసారం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట
చేస్తున్న సందర్భాన్ని చూస్తూ హిందూ భక్తులు తరించిపోయారు.
అనంతరం ప్రత్యేక హారతి తో ముగించారు. అనంతరం ఆలయం చేరుకున్న భక్తులకు అన్నప్రసాదం అందించారు.
ఈ కార్యక్రమంలో కొనతం సత్యనారాయణ రెడ్డి, చల్లా శ్రీలత రెడ్డి, పాల్వాయి రమేష్, స్వామి కృపాకర్, మెట్టు వేణుగోపాల్ రెడ్డి, భువనగిరి అంజయ్య రాచకొండ శ్రీనివాస్, రమేష్, గోళ్ళ సుధాకర్, రమణారెడ్డి ,జంగయ్య, శ్రీరామ్ రెడ్డి, తాటికొండ శ్రీనివాస్ రెడ్డి ,మా శెట్టి మోహన్, కొత్త లక్ష్మణ్,వీరవెల్లి శ్రీలత విజయలక్ష్మి, వినాయక రావు తదితరులు పాల్గొన్నారు