కేకే మీడియా ఆగస్టు 30
అందాల భామల గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ఆన్ లైన్ మాధ్యమాలను ఫుల్లుగా వాడేస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు నేటితరం యంగ్ హీరోయిన్స్. ఇదే లిస్టులో ఉంది హాట్ బ్యూటీ
‘రొమాంటిక్’ సినిమాతో పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ.. తన అందచందాలతో యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. తెలుగు తెరపై గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకోవడమే గాక యువత మనసు దోచేసింది.
తొలి సినిమాలో ఆకాష్ పూరితో చేసిన రొమాన్స్ అమ్మడికి బాగానే వర్కవుట్ అయింది. పూరి జగన్నాథ్ సినిమా, పైగా ఆయన తనయుడు హీరో కావడంతో ఈ సినిమాతో కేతిక పేరు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినిపించింది.