హైదరాబాద్ కేకే మీడియా జూన్ 25
కేంద్ర మంత్రి అమిత్ షా తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ కాలేదు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నా అమిత్ షా బిజీగా ఉండడంతో సమావేశం రద్దయింది. రాష్ట్ర సమస్యలపై వివిధ కేంద్ర మంత్రులతో మాట్లాడే క్రమంలో భాగంగా అమిత్షాతో అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ మిగతా మంత్రులతో చర్చలు సఫలమైనప్పటికీ అమిత్ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని కేంద్ర హోంశాఖ అధికారులు కేటీఆర్ కు సమాచారం అందించారు. దీంతో రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో వున్న మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.