ఆదర్శ కమ్యూనిస్టులు అరిబండి ఓంకార్, అరిబండి లక్ష్మీనారాయణ
నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 15:
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఉద్యమ నిర్మాతలు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ అరబండి ఓంకార్ మరియు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు అరిబండి లక్ష్మీనారాయణ ఆదర్శ కమ్యూనిస్టులని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరావు అన్నారు.
అరెబండి లక్ష్మీనారాయణ, ఆరిబండి ఓంకార్ల వర్ధంతి సందర్భంగా పెంచికల్ దిన్న అరిబండి ఓంకార్ భవన్లో గురువారం శాఖ కార్యదర్శి అల్వాల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సంతాప సభ కార్యక్రమం లో మర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ త్వానికి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాల ద్వారా నిజాం రజాకార్ల దాడులు దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలను దోపిడీలకు వ్యతిరేకంగా జమీందారులు జాగిర్దారుల కబంధహస్తాలతో ఉన్న భూములను తెలంగాణలోని పేదలకు పంచిపెట్టారు వీరోచితంగా సాగిన ఈ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసులు దాడులను దౌర్జన్యాలను ఎదుర్కొనే ప్రజల పక్షాన పోరాడిన అమరవీరులు ఆదర్శ కమ్యూనిస్టులు అన్నారు వారి ఆదర్శాలను కొనసాగించు ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో నందమూరి బాబురావు వల్లంశెట్ల లచ్చయ్య, సుంకర శ్రీరామ్మూర్తి, అరిబండి ప్రసాదరావు, బొప్పని రాణమ్మ, పాలకూరి రాములమ్మ, కర్నాటి మురళి, అరి బండి రామారావు, జీడిమెట్ల రవి, ఊట్కూరి సైదులు, పెరుగు నాగరాజు, రేవెల్లి బిక్షం, ఎడవల్లి రాములు, గుడిపూడి గౌరయ్య, వల్లం చెట్ల కోటేశ్వరరావు, పసుపులేటి నరసింహారావు, కొదమగుండ్ల సైదమ్మ, కోడి రెక్క పవన్, సుంకరి సోమేశ్వరరావు, బత్తిని రామకృష్ణ, సిరికొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.