పనులు పారదర్శకంగా ఉండాలి.
పిల్లలకు మెరుగైన విద్యాబోధన అందించాలి.
కేసారం రెండు పడకల గదుల ఇండ్ల పరిశీలన.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
కేసారం ఫేస్ 2 రెండు పడకల గదుల ఇండ్లలో సి.సి. రోడ్లు, సంప్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కేసారం మొదటి, రెండో ఫేస్ రెండు పడకల గదుల ఇండ్లను, ప్రైమరీ పాఠశాల అలాగే సూర్యాపేట లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జెడ్పి ఉన్నత పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ కేసారం ఫేస్ 1 రెండుపడకల గదుల ఇండ్ల తో పాటు ఫేస్ 2 లోని సంప్, సి.సి రోడ్ల పనులను పరిశీలించి పనులు నాణ్యతతో ఉండాలని పనులు అలాగే వేగవంతం చేయాలని సూచించారు. రెండు పడకల ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లను త్వరలో చేపట్టాలని , వాటర్ లైన్, శానిటరీ పనులు సక్రమంగా మొదలు పెట్టనందున ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసారం లోని ప్రైమరీ, సూర్యాపేట లోని జెడ్పి ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున పిల్లలకు మెరుగైన విద్యా బోధన అందించాలని సూచించారు. అదేవిదంగా పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లల ప్రవేశాలు, హాజరు శాతం ఎక్కువగా ఉండాలని పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణి వివరాలు తెలుసుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలకు మైనర్ పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని పనులను వేగవంతం చేయాలని సూచించారు.
తదుపరి ఫేస్ 2 రెండుపడకల గదుల ఇండ్ల పనులపై ఆర్.డి.ఓ, ఆర్.అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో పనులపై సమీక్షించి , పనులు వేగవంతం గా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.