నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 31
హుజూర్నగర్ నియోజకవర్గంలోని 141 గ్రామాలు 2 మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నానని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. అతి కొద్ది కాలంలోనే రూ 3500 కోట్ల రూపాయల నిధులతో వెనకబాటుకు గురైన హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నానన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మండలంలో వరుస కార్యక్రమాలతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బిజీ బిజీగా గడిపారు. మొదట మండలంలోని మేడారం గ్రామంలో రూ 40 లక్షలతో నిర్మిస్తున్న దేవాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నేరేడుచర్ల పట్టణంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశెట్ల రమేష్ బాబు వీధిలో రూ 5 లక్షల తో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అటు తరువాత నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా రూ 99.55 లక్షలు మంజూరు కాగా పనులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతున్నామని భయపడేంత స్థాయిలో పనిచేస్తున్నానన్నారు. కేసులు వేయడంలో కాకుండా అభివృద్ధిలో పోటీ పడాలని ఉత్తమ్ కుమార్ కు తాను ఏనాడో సవాల్ విసిరినట్లు తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఉత్తమ్ కు కళ్ళు మండుతున్నాయని నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ల సమయంలో తప్ప నియోజకవర్గానికి ఏనాడూ రాని ఉత్తమ్ నేడు హడావిడిగా గ్రామాల బాట పట్టారని విమర్శించారు. పదవులు శాశ్వతం కావు సేవే ముఖ్యమని అదే లక్ష్యంతో తాను ఎమ్మెల్యేగా మీకోసమే పనిచేసేందుకు వచ్చానన్నారు. ప్రజా సేవకు పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని విడతల వారీగా పదవులు లభిస్తాయన్నారు.
నూతనంగా మార్కెట్ చైర్మన్ గా నియామకమైన నాగండ్ల శ్రీధర్ సమర్ధవంతమైన నాయకుడని కొనియాడారు. ప్రజల కష్టాలు గుర్తెరిగి అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకు వస్తున్న కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు లభించడం వరమన్నారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ టూరిస్టులాగా వచ్చి వెళ్లడం తప్ప ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. వర్గాలుగా విడిపోయి తన్నుకోవడం తప్ప పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు.
అంతకుముందు బిఆర్ఎస్ పట్టణ కార్యాలయం నుండి మహిళల కోలాట ప్రదర్శనతో ,డప్పు వైద్యాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రమాణస్వీకారం మహోత్సవ సభా ప్రాంగణానికి తరలి వెళ్లారు. నూతనంగా మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన నా గండ్ల శ్రీధర్ ను వైస్ చైర్మన్ సోమ గాని మురళి , డైరెక్టర్లలను పట్టు శాలువాలతో పూలమాలలతో ఎమ్మెల్యే సైదిరెడ్డి తో పాటు బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు. మార్కెట్ చైర్మన్ గా శ్రీధర్ తో తొలి సంతకం చేయించి కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు , ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి బిక్షం , జెడ్పిటిసి నరసయ్య , డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతా రెడ్డి , వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ , మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనతం సత్యనారాయణ రెడ్డి ,బిఆర్ఎస్ నేరేడుచర్ల పాలకవీడు మండల పార్టీ అధ్యక్షులు అరి బండి సురేష్ బాబు , కిష్టిపాటి అంజిరెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ లు అనంత్ శ్రీనివాస్ గౌడ్ , శాఖమూరి శ్రీకాంత్ , బిఆర్ఎస్ మండల పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎల్లబోయిన లింగయ్య , సైదులు నూతనంగా ఎంపికైన డైరెక్టర్లు , మున్సిపల్ కౌన్సిలర్లు , పలు గ్రామాల సర్పంచులు , నాయకులు , రైతులు అభిమానులు పాల్గొన్నారు.