కేకే మీడియా సూర్యాపేట నవంబర్ 13
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలా వ్యవసాయం
సూర్యాపేట ను అభివృద్ధి చేసింది ఎవరో ప్రజలు గుర్తించాలి
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి
కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం
సూర్యాపేటలోని మూడవ వార్డులో గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం
సునీతమ్మ ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన స్థానికులు
సూర్యాపేట
ఎవరి పాలనలో సూర్యాపేట అభివృద్ధి జరిగిందో, అభివృద్ధి చేసింది ఎవరో ప్రజలు గుర్తించాలని భీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి, గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో తన భర్త జగదీష్ రెడ్డికి మద్దతుగా గడపగడపకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న సునీత జగదీష్ రెడ్డి ప్రచారం మూడవ వార్డులో కొనసాగింధి. భీఆర్ఎస్ మ్యానిఫెస్టో ను వివరిస్తూ సాగిన ప్రచారానికి స్థానిక ప్రజలు బ్రహ్మారథం పట్టారు. ఈ సందర్భంగా సునీత జగదీష్ రెడ్డి మాట్లాడుతూ,అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి అన్నారు.సీఎం కేసీఆర్ పాలనలోనే వ్యవసాయం
పండుగలా మారిందన్నారు.
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి అని కోరిన ఆమె, 2014లో కారు గుర్తుకు ఓటు వేసి జగదీష్ రెడ్డి ని గెలిపిస్తే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయన్నారు. మూసి మురికి నీటి నుండి విముక్తి కల్పించినా,ఆహ్లాదం కోసంట్యాంక్ బండ్లు వచ్చినా, మెడికల్ కాలేజీ వచ్చినా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చినా, అద్దంలా మెరిసే రహదారుల
నిర్మాణం జరిగినా, కారు గుర్తుకు వేసిన ఓటు ద్వారానే వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం అన్న సునిత జగదీష్ రెడ్డి, కారు గుర్తుకు ఓటు వేసి జగదీష్ రెడ్డి గారిని గెలిపియడం ద్వారా సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.