Saturday, January 17, 2026
HomeTelanganaఅభాగ్యులను ఆదుకునే వారెవరు ?

అభాగ్యులను ఆదుకునే వారెవరు ?

పాపమ్మ కు దిక్కెవరు?

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల :

అనాథలకు ,అభాగ్యులకు అండదండ లేకుంటే బతుకు భారమేనా అన్నట్లు తయారయింది పాపమ్మ పరిస్థితి.
ఉమ్మడి నేరేడుచర్ల మండలం ప్రస్తుత పాలకీడు మండలం గుండ్లపాడు గ్రామంలో
పుట్టి పెరిగిన పాపమ్మ నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన పులి అంజయ్యతో వివాహం కాగా బ్రతుకుతెరువు నిమిత్తం నేరేడుచర్లలో సిమెంటు ఇటుకల తయారీ కంపెనీలో సుమారు పది సంవత్సరాలపాటు భార్యాభర్తలిద్దరూ కూలీలుగా జీవనం సాగించగా వారికి మగ బిడ్డ జన్మించి కొన్నాళ్లకే మరణించగా కొంతకాల అనంతరం అనారోగ్య కారణాలతో పాపమ్మ భర్త అంజయ్య మృతి చెందగా నేడు అనాదగా మారింది.
పాపమ్మ భర్త మరణం తర్వాత తన అమాయకమైన వ్యవహార శైలితో ఒక్కతే కొన్నాళ్ళు అదే ఇటుకల కంపెనీలో పని చేసిన కంపెనీ మూతపడగా బ్రతుకుతెరువు కోసం నేరేడుచర్ల పట్టణంలోని విశ్వనాధ్ హోటల్లో కూలి గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.
పది సంవత్సరాల క్రితం భర్త చనిపోయిన వితంతువు పెన్షన్ రాకపోవడంతో
తెలిసినవారిని అడగగా ఆధార్ సరిగా లేదని వాటిని సరి చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించక నేటికీ పెన్షన్ రాక ఆధారం లేక కూలీగా జీవనం సాగిస్తూ బతుకు వెల్లదీస్తోంది.
ఆధార్ అన్నింటికీ తప్పనిసరి చేసిన ప్రభుత్వం సమస్యలను నివృత్తి చేయడంలో విఫలమైంది. స్థానికంగా సమస్య తీరే అవకాశం లేక రాజధాని వరకు వెళ్లాల్సిన పరిస్థితి తోడు లేక ఎవరు సహకరించక వెళ్లలేని పరిస్థితి.
ఓట్లప్పుడు ఓట్ల కోసం పాట్లు పడే నాయకులు సైతం, పేద బడుగు బలహీన వర్గాల సమస్యలే మా ఎజెండా అనే వారు ఇలాంటి అభాగ్యులను పట్టించుకునే పరిస్థితి లేదు.
కనీసం ఆధార్ లేక ఓటు హక్కు సైతం నమోదు చేసుకోలేని ఇలాంటివారీ పట్ల ప్రభుత్వ అధికారులం స్వచ్ఛమైన పరిపాలన సేవలు అందిస్తామని చెప్పే వారు ఇలాంటి వారిని గుర్తించడంలో విఫలమయ్యారని చెప్పాలి.
ఇప్పటికైనా ప్రజాస్వామిక దేశంలో అర్హత ఉన్న ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం పొందలేని పాపమ్మ లాంటి నిర్భాగ్యులకు
అండ,దండ ఎవరూ లేరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆలోచన కాకుండా నేను నిస్వార్ధమైన నాయకుడ్ని, సేవకున్ని, అధికారినే అనే ప్రతి ఒక్కరూ ఆలోచించి పాపమ్మకు సహాయం అందించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments