నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 4
అన్నా అని స్వతంత్రంగా పిలవగలిగే నేను కావాలా ఆరు నెలలకు ఒకసారి వచ్చి సార్ అని పిలిపించుకునే ఉత్తం కావాలా ఆలోచించుకోవాలని హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
శనివారం నేరేడుచర్లలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన పట్టణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గాన్ని నాలుగువేల కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరికీ చేరువైన టిఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చేయలేని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో చేసి చూపించానని మరొక అవకాశం ఇస్తే హుజూర్నగర్ రూపూ రేఖలు మారుస్తానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాక ఇవ్వని హామీలు ఎన్నో నెరవేర్చమని లిఫ్టులు ,చెక్ డ్యాములతో రైతులకు ప్రయోజనకరమైన పనులు ఎన్నో చేశామని లబ్ధిదారులకు అందించే సంక్షేమ పథకాలు పై సంతకాలు పెట్టడానికే సంవత్సరాలు పట్టేదని నేడు ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు నిధులు అందుతున్నాయని తెలిపారు.
హుజూర్నగర్ దశ దిశ మారాలంటే మరొక్క మారు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు