హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 11
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి
*అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి..
*ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది..
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హుజూర్ నగర్ ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అన్నారు.సోమవారం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని శాఖల పనితీరు అభివృద్ధి పనులపై సమీక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.10 లక్షలు అందిస్తున్నందున ఈ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.అలాగే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుండి వచ్చే వినతులు స్వీకరించి పరిష్కరించాలని,హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి రావడం పట్ల హుజూర్ నగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఆర్డిఓ ఎన్.జగదీశ్వర్ రెడ్డి, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,డిసిసిబి డైరక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు తహసీల్దార్ నాగార్జున రెడ్డి,ఇంచార్జి ఎంపిడిఓ లావణ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.