పొంగిన కాలువ- నీటితో నిండిన ఇళ్ళు
ఆక్రమణలు/అధికారుల నిర్లక్ష్యమే కారణమా..
నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 8:
నేరేడుచర్ల ప్రధాన రహదారికి ఆనుకొని ప్రవహించే జాన్ పహాడ్ మేజర్ పరిధిలోని R3 పంట కాలువ ఉప్పొంగి కాలువ వెంట నిర్మించిన ఇండ్లు మరియు ప్రధాన రహదారి పై భారీగా నీరు చేరి తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
సంవత్సర కాలంగా సాగర్ ఆయకట్టుకు సరైన నీరు లేని కారణంగా పంట కాలువలకు నీరు రాకపోవడం తో సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న భారీ నీటి వరదతో ఖరీఫ్ పంటకు నీటి విడుదల చేయగా జాన్పాడు మేజర్ కింద ఉన్న ఆర్త్రీ కాలువలో ఒక్కసారిగా నీరు ప్రవహించడంతో ఆక్రమణలకు తోడు, చెత్తాచెదారం తో కాలువ నిండిపోయి నీళ్లు వదులుతారని తెలిసిన సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నీటి ఉధృతికి పంట కాలువలకు తూముల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయి నీరు సరిగా పోక కాలువ పైనుండి నీరు ప్రవహించి కాలవకు అనుకుని నిర్మించిన ఇండ్లలో నుండి ప్రధాన రహదారి వరకు ఒక్కసారిగా నీరు వచ్చి చేరడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
ఇప్పటికే అనేకచోట్ల ఎన్ఎస్పి కాలువలు ఆక్రమణలు చేసుకొని నిర్మాణాలు చేపట్టి మీరు బయటకు వెళ్లకుండా కొన్నిచోట్ల కట్టడాలు నిర్మాణం చేసిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం తో పాటు కాలవ చుట్టూ పక్కల ప్రజలు ,దుకాణదారులు, చెత్త చదారాన్ని కాలవలలోకి పడవేయడం కి తోడు నీరు ఒక్కసారిగా వచ్చి చేరడం వాటన్నింటినీ అధికారులు ముందస్తుగా శుభ్రపరచుకోకపోవడంతో ఆ నీరు కాలువల గుండా ప్రవహించడానికి వీలుకాక కాలువ పైనుండి ప్రవహించి ఇలాంటి ఇబ్బందులు తరచూ వస్తున్నాయని , వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.