Thursday, March 20, 2025
HomeAndhra Pradeshఅదానీ గ్రూప్ పై చర్యలు తీసుకోండి

అదానీ గ్రూప్ పై చర్యలు తీసుకోండి

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సంచలన లేఖ రాశారు. ఏపీలో అదానీ గ్రూప్ కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నందున ఒప్పందాన్ని రద్దు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 2021లో అదానీ, ఏపీ రాష్ట్ర డిస్కమ్‌ల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని.. ఈ ఒప్పందాల వ్యవహాలంలో అవినీతి జరిగిందని అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారించిందని పేర్కొన్నారు.అధునాతన సాంకేతికతల రాకతో, రోజురోజుకు అధిక-నాణ్యత గల విద్యుత్‌ను పొందడం సులభం అవుతుందన్నారు.

ఇది ఆటోమేటిక్‌గా చౌకగా మారుతుందనేది వాస్తవమని.. 25 సంవత్సరాల కాలానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం సహేతుకం కాదని తన అభిప్రాయాన్ని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని నష్టం అయితే, ఆ భారం చివరికి ఏ తప్పు చేయని ప్రజలపై పడుతుందని లేఖలో వివరించారు. శాశ్వత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి భారీ ఉపశమనం కలిగించే మీరు జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments