Sunday, September 8, 2024
HomeAndhra Pradeshఅగ్నికి ఆహుతైన 120 గొర్రెలు

అగ్నికి ఆహుతైన 120 గొర్రెలు

విజయవాడ కేకే మీడియా ఫిబ్రవరి 25
ఉమ్మడి అనంతపురం జిల్లా కంబదూరు మండలం లోని ఎగువపల్లి గ్రామానికి చెందిన గొల్ల బడప్ప,కురుబ రాము,కురుబ రంగా రెడ్డి ల గొర్ల కాపర్లకు సంబంధించిన దాదాపు 120 గొర్రె పిల్లలు.గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చింత చెట్టుకింద ఉన్న ఎండు గడ్డికి నిప్పు పెట్టడంతో ఆ మంటలు వ్యాప్తి చెందడంతో గొర్రె పిల్లలన్నీ కాలి బూడిద అయ్యాయని కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో సుమారుగా ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారిని ఆదుకునేలా రాష్ట్రంలో ఉన్న గోర్రెలు మేకలకు ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.కురువలు ప్రదాన వృత్తి గోర్రెల కాపరులం గోర్రెలు రొడ్డు యాక్సిడెంట్.నీటమునిగి చనిపోయినప్పుడు మరియు రైలు ప్రమాదం పిడుగుపాటు గురై మృతి చెందిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి.కావున ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా గోర్రెల కాపరులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments