సూర్యాపేట జిల్లానేరేడుచర్ల: కేకే మీడియా ఫిబ్రవరి 24
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని పినాకిల్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా శనివారం పిల్లలు ఒకరోజు ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అక్షరాలు నేర్పడం అంటే పలకబలపమే కాదు బొమ్మలు, నాట్యం ద్వారా బోధన చేశారు. మన పిల్లల పట్ల మన గొప్ప కర్తవ్యం మొదట వారిని ప్రేమించడం, రెండవది వారికి నేర్పించడం. మన పిల్లలకు తమను తాము పరిపాలించుకునే జ్ఞానం మరియు సాధనాలను కలిగి ఉండేలా.. వారికి సమర్థవంతంగా నేర్పించడం అని జిజ్ఞాస కలిగించారు. అలాగే కొందరు విద్యార్థులు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులుగా పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పినాకిల్ విద్యాసంస్థ చైర్మన్ మదార్ మాట్లాడుతూ… రాజకీయాలు అంటే ప్రతి అంశం పట్ల అవగాహన పెంచుకోవడమే అని, అవి సమాజంలోని సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తాయని, విద్యా సంస్థలు కేవలం విజ్ఞానాన్ని అందించే కేంద్రాలు కాదు. అవి బహిరంగ చర్చ, విమర్శ, భావాలపై పోటీ పడే కేంద్రాలుగా ఉండాలని అన్నారు. అధికారులు పాలనలో సుపరిపాలనను ప్రజలకు అందించడం కోసం, అట్టడుగున ఉన్న ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం కోసం తగిన తోడ్పాటును అందించాలని, పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి మరియు అవినీతిని నిరోధించడానికి క్రృషి చేయాలని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని, సమాజ హితానికి పనికి వచ్చే విద్యార్థులను తీర్చిదిద్దేది ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే అని, అక్షరాల వ్యవసాయంలో (ఒక్క రోజు ఉపాధ్యాయులు) పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.